- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాహుల్ గాంధీపై పోటీకి సీపీఐ డి.రాజా భార్య పోటీ.. ఇండియా కూటమిలో కీలక పరిణామం
దిశ, డైనమిక్ బ్యూరో:ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ప్రియాంక గాంధీతో పాటు పార్టీ నేతలతో భారీ ర్యాలీగా వెళ్లిన రాహుల్ గాంధీ నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. అయితే ఇదే స్థానం నుంచి సీపీఐ అభ్యర్థిగా సీపీఐ జనరల్ సెక్రటరీ డీ.రాజా సతీమణి అన్నే రాజా పోటీకి దిగడం చర్చగా మారింది. ఆమె కూడా ఇవాళే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో వయనాడ్ పాలిటిక్స్ ఇండియా కూటమిలో చర్చగా మారింది. కేరళలో అధికారంలో ఉన్న లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ భాగస్వామిగా సీపీఐ పోటీలో నిలిచింది. అయితే ఓ వైపు ఇండియా కూటమిలో సీపీఐ పార్టీ కొనసాగుతుండగా అదే కూటమిలో కీలకంగా ఉన్న రాహుల్ గాంధీపై సీపీఐ అభ్యర్థిని నిలపడం ఆసక్తిని రేపుతున్నది. ఓ వైపు వయనాడ్ లో రాహుల్ గాంధీని ఓడించేందుకు బీజేపీ పక్కా ప్రణాళికలు వేస్తోంది. రాహుల్ గాంధీని ఓడించేందుకు బీజేపీ అధిష్టానం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కే. సురేంద్రన్ బరిలోకి దింపింది. ఇటువంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీపై ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న సీపీఐ జనరల్ సెక్రటరీ డీ.రాజా సతీమణి పోటీకి నిలవడం చర్చగా మారింది. దీంతో వీరిలో చివరి వరకు ఎవరైనా పోటీ నుంచి తప్పుకుంటారా లేక చివరి నిమిషం వరకు తలపడతారా అనేది కాలమే నిర్ణయించనున్నది.