- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దేశానికి బాబా మోడీ అవసరం లేదు.. అసదుద్దీన్ ఓవైసీ ఘాటు వ్యాఖ్యలు
దిశ, నేషనల్ బ్యూరో: మోడీ ప్రభుత్వం.. నిర్దిష్ట సమాజానికేనా.. లేదా యావత్ దేశానికా ఆని ప్రశ్నించారు ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. పార్లమెంటులో రామమందిర నిర్మాణం, ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంపై చర్చ సందర్భంగా ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. "భారత ప్రభుత్వానికి మతం ఉందా" అని ప్రశ్నించారు. ఈ దేశానికి మతం లేదని తాను నమ్ముతున్నట్లు తెలిపారు. దేశానికి మోడీ బాబా అవసరం లేదన్నారు. జనవరి 22న ఒక మతంపై మరో మతం గెలిచిందనే సందేశాన్ని ఇవ్వాలనుకుంటుందా అని మండిపడ్డారు. దేశంలోని 17 కోట్ల మంది ముస్లింలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించారు.
"నేను బాబర్ ప్రతినిధినా, జిన్నా లేదా ఔరంగజేబు ప్రతినిధినా?... నేను రాముడిని గౌరవిస్తాను. నాథూరాం గాడ్సేను ద్వేషిస్తున్నాను.. ఎందుకంటే అతను హే రామ్ అంటూ మరో వ్యక్తిని చంపాడు” అని తన ప్రసంగంలో చెప్పారు. అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చివేసిన రోజు.. డిసెంబర్ 6, 1992 తర్వాత దేశంలో అల్లర్లు జరిగాయన్నారు. యువకులను జైళ్లో పెడితే.. వారు వృద్ధులయ్యాక బయటకు వచ్చారని తెలిపారు. అసదుద్దీన్ తన ప్రసంగాన్ని ముగించే ముందు.. "బాబ్రీ మసీదు జిందాబాద్.. బాబ్రీ మసీదు ఉంది.. ఎప్పటికీ ఉంటుంది” అని వ్యాఖ్యానించారు.