Coromandel express accident : కోరమాండల్ రైలు ప్రమాదం.. కాంగ్రెస్ నేతలకు ఖర్గే కీలక సందేశం

by Mahesh |   ( Updated:2023-06-03 05:39:32.0  )
Coromandel express accident : కోరమాండల్ రైలు ప్రమాదం.. కాంగ్రెస్ నేతలకు ఖర్గే కీలక సందేశం
X

దిశ, వెబ్‌డెస్క్: ఒడిశాలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదం యావత్ భారతదేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ విషాద సంఘటనలో ఇప్పటికే 273 మంది ప్రయాణికులు మృతి చెందగా మరో 900 మంది గాయాలపాలయ్యారు. దీంతో వెంటనే స్పందించిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే.. ట్విట్టర్ ద్వారా మృతులకు సంతాపం తెలిపారు. అలాగే ఒడిశా కాంగ్రెస్ నేతలకు, కార్యకర్తలకు ముఖ్య సందేశం అందజేశాడు. ఒడిశా కాంగ్రెస్ కార్యకర్తలందరూ.. ప్రమాద ప్రదేశానికి చేరుకుని సహాయ చర్యల్లో పాల్గొనాలని కోరారు. దీంతో సంఘటనా స్థలానికి దగ్గరలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు సమాచారం.

Also Read..

Odisha Train Accident: :కోరమండల్ రైలు ప్రమాదంలో 270 మంది మృతి.. అభిమానులకు చిరు కీలక పిలుపు!

Advertisement

Next Story