కోరమాండల్ రైలు ప్రమాదానికి అదే కారణం: రైల్వే బోర్డు మెంబర్‌ జయవర్మ సిన్హా కీలక వ్యాఖ్యలు

by Satheesh |
కోరమాండల్ రైలు ప్రమాదానికి అదే కారణం: రైల్వే బోర్డు మెంబర్‌ జయవర్మ సిన్హా కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కోరమాండల్ రైలు ప్రమాద ఘటనపై రైల్వే బోర్డు మెంబర్‌ జయవర్మ సిన్హా కీలక విషయాలు వెల్లడించారు. ఈ ఘటనపై ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఒడిషా రాష్ట్రంలోని బహనాగ స్టేషన్‌ వద్ద ప్రమాద ఘటన చోటు చేసుకుందని తెలిపారు. బహనాగ స్టేషన్‌ వద్ద రెండు లూప్‌ లైన్స్, రెండు మెయిన్‌ లైన్స్ ఉన్నాయని చెప్పారు.

ఓ లూప్‌ లైన్‌లో భారీగా ఐరన్‌ ఓర్‌‌తో గూడ్స్ రైలు వెళ్తుండగా.. సిగ్నలింగ్ సమస్య వల్ల కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ కూడా లూప్ లైన్‌లోకి రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. ఒడిషా రైలు ప్రమాద ఘటనకు ప్రధాన కారణం సిగ్నలింగ్ సమస్య అనే ఆమె పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి కారణం ఓవర్‌స్పీడ్‌ కారణం కాదని.. రెండు రైళ్లు నిర్దేశిత వేగంతోనే వెళ్తున్నాయని చెప్పారు. భారీ ఐరన్ లోడ్‌తో ఉన్న గూడ్స్‌ను కోరమాండల్‌ ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా జరిగిందని ఆమె తెలిపారు.

Advertisement

Next Story