Coromandel express accident: రిజర్వేషన్ కోచ్‌లో కిక్కిరిసిన ప్రయాణీకులు (వీడియో)

by Sathputhe Rajesh |   ( Updated:2023-06-06 11:57:36.0  )
Coromandel express accident: రిజర్వేషన్ కోచ్‌లో కిక్కిరిసిన ప్రయాణీకులు (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో జరిగిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో ఇప్పటికే మృతుల సంఖ్యల 300 దాటింది. ప్రమాద స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అయితే కోరమండల్ ట్రైన్‌ రిజర్వేషన్ కోచ్‌లో ఏ రేంజ్‌లో ప్రయాణీకులు ప్రయాణిస్తారో తెలిపే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రిజర్వేషన్ కోచ్‌లో ప్రయాణీకులు కిక్కిరిసి పోయి నిల్చోనే ప్రయాణిస్తున్నారు. ఒక రిజర్వేషన్ కోచ్‌లోనే ఇంత మంది ఉంటే మరి జనరల్ బోగీల పరిస్థితి ఏంటో ఊహించొచ్చు. మే 5న తీసినట్లు ఉన్న ఆ వీడియోలో ప్రయాణీకులు కనీసం నడిచే పరిస్థితి కనబడకపోవడం విశేషం. ఈ వీడియో చూసిన తర్వాత ప్రమాద సమయంలో రైలులో ఎంత భయానక దృశ్యాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

Advertisement

Next Story