బూస్టర్ డోసుగా కార్బెవాక్స్..

by sudharani |   ( Updated:2022-08-10 10:42:08.0  )
బూస్టర్ డోసుగా కార్బెవాక్స్..
X

న్యూఢిల్లీ: బూస్టర్ డోసు లేదా ప్రికాషన్ డోసుగా తీసుకునేందుకు కేంద్రం మరో వ్యాక్సిన్‌కు అనుమతి ఇచ్చిందిన్యూఢిల్లీ: బూస్టర్ డోసు లేదా ప్రికాషన్ డోసుగా తీసుకునేందుకు కేంద్రం మరో వ్యాక్సిన్‌కు అనుమతి ఇచ్చింది.. 18 ఏళ్లు పైబడిన వారిలో కార్బెవాక్స్‌ను ఉపయోగించేందుకు ఆమోదం తెలిపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కోవిషీల్డ్, కోవాగ్జిన్ తర్వాత బూస్టర్ డోసుకు ఆమోదం పొందిన వ్యాక్సిన్ ఇదే కావడం గమనార్హం. నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ కోవిడ్-19 వర్కింగ్ గ్రూప్ ఇటీవల చేసిన సిఫార్సుల ఆధారంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆమోదం పొందినట్లు సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.

కాగా, రెండో డోసు వ్యాక్సిన్‌గా కోవాగ్జిన్ లేదా కోవిషీల్డ్ తీసుకున్న 18 ఏళ్ల పైబడిన వారు ఆరు నెలలు లేదా 26 వారాల తర్వాత కార్బెవాక్స్‌ను బూస్టర్ డోసుగా వినియోగించవచ్చని తెలిపాయి. మొదటి రెండు డోసులు ఒక వ్యాక్సిన్, బూస్టర్ డోసు లేదా ప్రికాషన్ డోసుకు ఇతర వ్యాక్సిన్ గా ఆమోదం పొందిన టీకా ఇదే కావడం గమనార్హం. హైదారబాద్‌కు చెందిన బయోలాజికల్-ఈ సంస్థ తయారు చేసిన ఆర్బీడీ ప్రొటీన్ వ్యాక్సిన్ కార్బెవ్యాక్స్. దీనిని ప్రస్తుతం 12-14 ఏళ్ల వారికి కరోనా నియంత్రణకు వినియోగిస్తున్నారు. ఈ మధ్యనే బూస్టర్ డోసుగా వినియోగించేందుకు చేసిన ట్రయల్స్‌లో మెరుగైన ఫలితాలు ఇచ్చింది. ఈ మేరకు జూన్ 4న కార్బెవాక్స్‌ను 18 ఏళ్ల పైబడిన వారికి బూస్టర్ డోసు లేదా ప్రికాషన్ డోసుగా వినియోగించేందుకు ఆమోదం తెలిపింది. తాజాగా కేంద్రం కూడా టీకా వినియోగానికి పచ్చజెండా ఊపినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కేంద్రం ఇప్పటికే 75 ఏళ్ల స్వాతంత్ర వేడుకల్లో భాగంగా 75 రోజుల పాటు ఉచిత బూస్టర్ డోసు పంపిణీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో కార్బెవాక్స్‌కు ఆమోదం తెలపడం వ్యాక్సినేషన్ వేగవంతం చేసే ప్రణాళిక భాగమని అధికార వర్గాలు తెలిపాయి.

విటమిన్ బి6 అధిక మోతాదుతో నడక కోల్పోయిన వ్యక్తి


Advertisement

Next Story

Most Viewed