- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కంటెంట్ క్రియేటర్లు 'అత్యంత విలువైన వారు': మోడీ
దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు మానసిక ఆరోగ్యం ప్రాముఖ్యత గురించి అవగాహనను పెంపొందించడానికి స్థానిక భాషల్లో కంటెంట్‌ను అందించడానికి కృషి చేయాలని ప్రధాని మోడీ అన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జాతీయ సృష్టికర్తల అవార్డును అందించిన అనంతరం మాట్లాడిన ఆయన మానసిక ఆరోగ్యానికి సంబంధించి చాలా మంది కంటెంట్ క్రియేటర్లు కృషి చేస్తున్నారు. అయితే స్థానిక భాషల్లో కంటెంట్ లేకపోవడం వలన ప్రజలకు అర్థం కావడం లేదు. కాబట్టి దీని ఆవశ్యకతను దేశవ్యాప్తంగా అందించాలంటే కంటెంట్ క్రియేటర్లు స్థానిక భాషల్లో కంటెంట్‌ను అందించాలని మోడీ అన్నారు.
నిద్రలేమితనం, ఇతర మానసిక ఆరోగ్య సమస్యలను చాలా మంది సీరియస్‌గా తీసుకోరు. కానీ వీటి వలన చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ సమస్యల పరిష్కారంలో కంటెంట్ క్రియేటర్‌లను 'అత్యంత విలువైన వారి'గా మోడీ అభివర్ణించారు. దేశ రాజధానిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇరవై విభాగాలకు అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. అవార్డు గ్రహీతలలో, జాన్వీ సింగ్ హెరిటేజ్ ఫ్యాషన్ ఐకాన్ అవార్డును అందుకోగా, కబితా సింగ్ (కబితాస్ కిచెన్) ఫుడ్ కేటగిరీలో బెస్ట్ క్రియేటర్ అవార్డును కైవసం చేసుకుంది.