BIG అలర్ట్.. న్యూస్ పేపర్లలో ఫుడ్ తీసుకుంటున్నారా?

by Vinod kumar |   ( Updated:2023-09-28 06:30:57.0  )
BIG అలర్ట్.. న్యూస్ పేపర్లలో ఫుడ్  తీసుకుంటున్నారా?
X

న్యూఢిల్లీ: ఎవరైనా ఇష్టంగా చేసే పని ఏదైనా ఉంది అంటే అది తినడం ఒక్కటే. ఇంట్లో వండుకునే తినడానికి బద్దకం ఎక్కువై ఈ మధ్య కాలంలో ఆన్లైన్‌లో ఆర్డర్ చేసుకొని తినడం సర్వసాధారణం అయిపోయింది. ఇది ఎంతవరకు ఆరోగ్యం అనే విషయాన్ని ఏమాత్రం ఆలోచించకుండా లాగించేస్తుంటారు. ముఖ్యంగా ఫ్యామిలీతో బయటకు వెళ్లినప్పుడు రోడ్ మీద ఏం కనిపించినా తినేయడం కూడా కామన్ అయిపోయింది. సాయంత్రం సమయాల్లో అయితే మిర్చీలు, ఖారా, పునుగులు, టిఫిన్స్ వంటి ఆయిల్ ఫుడ్ అస్సలు మిస్ అవ్వరు. వీటిని టిఫిన్ సెంటర్లలో న్యూస్ పేపర్లలో పెట్టి ఇవ్వడం మనం చూస్తుంటాం.

అయితే, దీంతో ప్రాణాలకే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) పలు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. ఫుడ్ ప్రొడక్ట్స్ ప్యాకేజింగ్‌లో న్యూస్ పేపర్లు, నాణ్యతలేని ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా ఆపేయాలంటూ ఫుడ్ ఇండస్ట్రీలకు నిర్దేశించింది. ప్రత్యేకించి నూనెలో తయారు చేసే ఫుడ్ ఐటమ్స్‌ను తినేటప్పుడు న్యూస్ పేపర్లను వాడొద్దని హెచ్చరించింది. న్యూస్ పేపర్ మెటీరియల్ అనేది ఆయిల్ ఫుడ్స్‌లోని నూనెను పీల్చుకోవడం సంగతి అలా ఉంచితే.. అందులోని ప్రమాదకర పదార్థాలను ఆయిల్ ఫుడ్‌లోకి ఈజీగా పంపిస్తుందని తెలిపింది. అందుకే ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీయని ఫుడ్ గ్రేడ్ ప్యాకేజింగ్ మెటీరియల్‌నే వాడాలని ఆహార ఉత్పత్తుల తయారీ సంస్థలను కోరింది.

ఏదైనా ఆహార పదార్థాలను కొనేటప్పుడు ప్యాకేజింగ్ విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రజలకు సూచించింది. న్యూస్ పేపర్లలో ఉపయోగించే సిరాలోని సీసం, భార లోహాలు.. అందులో ప్యాక్ చేసిన ఫుడ్‌లోకి ఇంకిపోయి, మనిషి తిన్నాక ఆరోగ్యంపై దుష్ప్రభావాన్ని చూపించడం మొదలుపెడతాయని హెచ్చరించింది. వార్తా పత్రికల పంపిణీ ప్రక్రియ అనేక విధాలుగా జరుగుతుంటుందని.. ఈ క్రమంలో ఏదైనా ఒక దశలో వాటిలోకి వైరస్‌లు, బ్యాక్టీరియాలు చేరే ముప్పు ఉంటుందని పేర్కొంది. ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (ప్యాకేజింగ్) రెగ్యులేషన్స్- 2018’ ప్రకారం ఆహారాన్ని నిల్వ చేయడానికి, ప్యాక్ చేయడానికి న్యూస్ పేపర్లను వినియోగించడంపై బ్యాన్ ఉన్న విషయాన్ని ఎఫ్ఎస్ఎస్ఏఐ గుర్తు చేసింది.

Advertisement

Next Story