ముంబైని మహారాష్ట్ర నుంచి విడగొట్టే కుట్ర: సంజయ్ రౌత్

by Mahesh |
ముంబైని మహారాష్ట్ర నుంచి విడగొట్టే కుట్ర: సంజయ్ రౌత్
X

ముంబై: మహారాష్ట్ర నుంచి ముంబైని విడగొట్టే కుట్ర జరుగుతోందని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. నిరంతరం దాడులకు గురి చేయడంతో నగరాన్ని ఆర్థికంగా, భౌగోళికంగా, సామాజికంగా నిర్వీర్యం చేసే పన్నాగం పన్నారని, కేంద్రపాలిత ప్రాంతంగా మార్చి బలహీనపరిచే ఎత్తుగడలను తిప్పికొడతామని ధీమా వ్యక్తం చేశారు. గుజరాత్ పారిశ్రామికవేత్తలు ముంబైని తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు చేస్తున్న కుట్రకు కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ రాష్ట్రానికి చెందిన మోడీ, అమిత్ షా అండగా నిలుస్తున్నారని రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంయుక్త మహారాష్ట్ర ఉద్యమంలోనూ, దేశ స్వాతంత్ర్య పోరాటంలోనూ బీజేపీ ఎలాంటి పాత్ర పోషించలేదని గుర్తు చేశారు.

Advertisement

Next Story