ప్రధాని మోదీని హతమార్చేందుకు కుట్ర... దక్షిణ కర్ణాటకలో ఎన్.ఐ.ఏ వరుస దాడులు

by Shiva |
ప్రధాని మోదీని హతమార్చేందుకు కుట్ర... దక్షిణ కర్ణాటకలో ఎన్.ఐ.ఏ వరుస దాడులు
X

దిశ, వెబ్ డెస్క్ : 2022 జూలైలో పాట్నా పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని హతమార్చేందుకు నిషేధిత సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) పన్నిన కుట్రకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌.ఐ.ఏ) బెంగళూరులోని దక్షిణ కర్ణాటక జిల్లాల్లలోకి పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, గత సంవత్సరం పీఎఫ్ఐ సభ్యుడు షఫీక్ పాయెత్‌పై రిమాండ్ నోట్‌లో, జూలై 12, 2022న పాట్నా పర్యటన సందర్భంగా ప్రధాన మంత్రి మోదీని లక్ష్యంగా చేసుకోవడానికి పీ.ఎఫ్.ఐ కుట్ర పన్నారని ఆ నోట్ లో ఉంది.

అందుకు సంబంధించి ప్రస్తుతం దక్షిణ కర్ణాటక జిల్లాల్లోని బెల్తంగడి, పుత్తూరు, బంట్వాళ, ఉప్పినంగడి, వేణుర సహా 16 చోట్ల ఎన్.ఐ.ఏ అధికారులు ఏకకాలంలో వరుస దాడులు చేస్తున్నారు. 2022 జులై 12న బీహార్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీపై దాడి చేసేందుకు నిషేధిత సంస్థ పన్నిన కుట్రపై విచారణలో భాగంగా ఈ దాడులు కొనసాగుతున్నాయి. స్థానిక పోలీసుల సహకారంతో 16 చోట్ల డాక్యుమెంట్ వెరిఫికేషన్‌ను అధికారులు నిర్వహిస్తున్నట్లు ఎన్.ఐ.ఏ వర్గాలు తెలిపాయి.

నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీ.ఎఫ్‌.ఐ) కార్యకర్తలకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాలు, ఆసుపత్రులపై ఏకకాలంలో మంగళూరుతో పాటు పుత్తూరు, బెల్తంగడి, ఉప్పినంగడి, వేణూరు, బంట్వాళాల్లో సోదాలు జరిగాయి. భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు కుట్ర పన్నేందుకు గల్ఫ్ దేశాల నుంచి పీ.ఎఫ్‌.ఐకి పెద్ద మొత్తంలో డబ్బు అందాయని ఆరోపించారు. ఈ దాడులు దక్షిణ భారతదేశంలోని పీ.ఎఫ్.ఐ హవాలా మనీ నెట్‌వర్క్‌ను అణిచివేసేందుకేనని ఎన్.ఐ.ఏ ప్రతినిధులు తెలిపారు.

గతేడాది 2022లో ఫుల్వారీ షరీఫ్ ప్రాంతంలో జరిపిన దాడుల తర్వాత దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఐదుగురు వ్యక్తులు పాట్నాలో అరెస్టయ్యారు. ఈ దాడుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని టార్గెట్ గా చేసుకున్న పీ.ఎఫ్.ఐ యొక్క 'మిషన్ 2047'తో సహా అనేక నేరారోపణ పత్రాలను కూడా స్వాధీనం ఎన్.ఐ.ఏ స్వాధీనం చేసుకుంది. ముఖ్యంగా దక్షిణ కర్ణాటకలో పీ.ఎఫ్.ఐ నెట్‌వర్క్ ఉండే అవకాశం ఉందని ఎన్‌ఐఏ వర్గాలు భావిస్తున్నాయి, అందుకే అధికారుల బృందం దక్షిణ కన్నడ జిల్లాకు వెళ్లి క్షేత్ర స్థాయిలో దాడులు నిర్వహిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed