- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మేఘాలయ సీఎంగా మరోసారి ఆయనే.. మోదీ సమక్షంలో ప్రమాణ స్వీకారం
షిల్లాంగ్: మేఘాలయ ముఖ్యమంత్రి గా కన్రాడ్ సంగ్మా మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. మేఘాలయ డెమోక్రటిక్ అలియన్స్ 2.0 పేరుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. గవర్నర్ ఫగు చౌహన్ సమక్షంలో మంగళవారం ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కొత్త ప్రభుత్వంలో తనతో కలిపి 12 మందికి చోటు మంత్రివర్గంలో చోటు కల్పించారు. ప్రెస్టోన్ తిన్సాంగ్, స్నియాభలాంగ్ ధార్ లు డిప్యూటీ సీఎం లుగా ప్రమాణ స్వీకారం చేశారు. మిగతా వారు కూడా ప్రమాణస్వీకారం చేసినప్పటికీ ఒకటి రెండు రోజుల్లో వారికి శాఖలు కేటాయించనున్నారు.
ఎన్పీపీ నుంచి ఏడుగురు, యూడీపీ నుంచి ఇద్దరు, బీజేపీ, హెచ్‌ఎస్పీడీపీ నుంచి ఒక్కరి చొప్పున మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రాభివృద్ధికి గత ఐదేళ్లలో వేసిన పునాదులపై మేం పని చేస్తూనే ఉంటామని సంగ్మా చెప్పారు. యువతకు, ఉపాధికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. అట్టడుగు స్థాయికి చేరే వివిధ పథకాల ప్రయోజనాల మొత్తం సామర్థ్యం మెరుగుపడిందని అన్నారు. ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ హజరయ్యారు.