వరుసగా రెండోసారి మేఘాలయ సీఎంగా కాన్రాడ్ సంగ్మా ప్రమాణ స్వీకారం

by Mahesh |
వరుసగా రెండోసారి మేఘాలయ సీఎంగా కాన్రాడ్ సంగ్మా ప్రమాణ స్వీకారం
X

దిశ, వెబ్‌డెస్క్: ఫిబ్రవరిలో మేఘాలయ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పిపి) 26 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పిపి) అధినేత కాన్రాడ్ సంగ్మా మంగళవారం మేఘాలయ ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో తనకు 32 మంది ఎమ్మెల్యేలతో సంపూర్ణ మెజారిటీ ఉందని సంగ్మా ప్రకటించారు. కాగా గత ఎన్నికల్లో ఎన్ పీపీ బీజేపీ, తో పాటు మరో పార్టీ ఎమ్మెల్యేల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాగా ఈ సారి కూడా అదే స్ట్రాటజీ కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది.

Advertisement

Next Story