ఎగ్జిట్ పోల్స్‌పై చర్చల్లో పాల్గొనడానికి ఇండియా కూటమి రెడీ

by Harish |
ఎగ్జిట్ పోల్స్‌పై చర్చల్లో పాల్గొనడానికి ఇండియా కూటమి రెడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసింది. జూన్ 4న ఫలితాలు ఎలా ఉంటాయోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్‌పై టీవీ చానెళ్ల చర్చల్లో పాల్గొనకూడదని శుక్రవారం నిర్ణయం తీసుకున్న ఇండియా కూటమి తాజాగా యూ-టర్న్ తీసుకుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇంట్లో ఇండియా కూటమి నేతలు శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్బంగా పలు విషయాలపై చర్చించిన వారు ఎగ్జిట్ పోల్స్‌లో పాల్గొనడానికి సిద్దంగా ఉన్నట్లు ప్రకటించారు.

కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా ఎక్స్‌లో పోస్ట్‌లో వ్యాఖ్యానిస్తూ, ఇండియా కూటమి నాయకులు సమావేశమయ్యారు. ఎగ్జిట్ పోల్స్‌‌లో పాల్గొని బీజేపీ, దాని వ్యవస్థను బహిర్గతం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. శుక్రవారం, కాంగ్రెస్ ఎగ్జిట్ పోల్ ఫలితాలకు సంబంధించిన చర్చల్లో పాల్గొనబోమని ప్రకటించింది, దీంతో భారతీయ జనతా పార్టీ స్పందిస్తూ కాంగ్రెస్ ఇప్పటికే ఓటమిని అంగీకరించిందని విమర్శించింది. కానీ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన తరువాత ఇండియా కూటమి తన నిర్ణయాన్ని మార్చుకుంది. అంతకుముందు పవన్ ఖేరా మాట్లాడుతూ కేవలం చానెల్‌ల TRPలను పెంచుకోవడానికి లేదా కొంత బలం ఉందనే ఊహాగానాలకు ఆస్కారం ఇవ్వడానికి తాము ఎగ్జిట్ పోల్‌లో పాల్గొనమని ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed