- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Kharge: బీజేపీ విధానాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తుంది.. ఖర్గే సంచలన ట్వీట్
దిశ, డైనమిక్ బ్యూరో: బుల్‌డోజింగ్‌ను ఉపయోగించి ఒకరి ఇంటిని కూల్చివేయడం అమానవీయమని, ఈ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఉపయోగిస్తున్న బుల్‌డోజింగ్ విధానంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన బీజేపీపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా.. ఒకరి ఇంటిని కూల్చివేసి, వారి కుటుంబాన్ని నిరాశ్రయులను చేయడం అమానవీయం, అన్యాయమని మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మైనారిటీలపై పదే పదే దాడులు జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని అన్నారు. అలాగే రూల్ ఆఫ్ లా ద్వారా నిర్వహించబడే సమాజంలో ఇటువంటి చర్యలకు స్థానం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌరుల్లో భయాందోళనలు రేకెత్తించేందుకు బుల్‌డోజింగ్‌ను ఉపయోగించే బీజేపి రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని, ఈ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. అరాచకం సహజ న్యాయాన్ని భర్తీ చేయదని చెబుతూ.. నేరాలకు కోర్టులలో తీర్పు ఇవ్వబడాలి, కానీ ప్రభుత్వానికి ప్రయోజనం చేకూర్చే బలవంతం ద్వారా కాదని ఖర్గే ఎక్స్ ద్వారా స్పష్టం చేశారు.