- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rahul Gandhi : పార్టీ ఫండ్ లెక్కలో రాహుల్‌గాంధీని మించిపోయిన కాంగ్రెస్ నేత
దిశ, నేషనల్ బ్యూరో : గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా వయనాడ్(కేరళ), రాయ్‌బరేలీ (ఉత్తరప్రదేశ్) స్థానాల నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పోటీ చేశారు. ఆ రెండు స్థానాల్లో ఎన్నికల ఖర్చు కోసం రాహుల్‌కు చెరో రూ.70 లక్షలు కాంగ్రెస్ పార్టీ ఫండ్ నుంచి అందాయి. ఈమేరకు వివరాలతో కూడిన ఎన్నికల వ్యయ నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ సమర్పించింది. అయితే హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్‌పై పోటీ చేసిన కాంగ్రెస్ నేత విక్రమాదిత్య సింగ్‌కు రూ.87 లక్షలను పార్టీ ఫండ్‌గా అందించారు. అంటే రాహుల్ గాంధీ కంటే విక్రమాదిత్యకే ఎక్కువ ఫండ్‌ను కేటాయించారు.
అయితే తాను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ రాహుల్ గెలవగా.. మండి స్థానంలో కంగనా రనౌత్ చేతిలో విక్రమాదిత్య ఓడిపోయారు. అమేథీ స్థానం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీ లాల్ శర్మకు పార్టీ ఫండ్‌గా రూ.70 లక్షలు ఇవ్వగా.. బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీని ఓడించారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు కె.సి.వేణుగోపాల్ (కేరళలోని అలప్పుజ స్థానం), మాణిక్కం ఠాగూర్ (తమిళనాడులోని విరుధు నగర్)లకు కూడా చెరో రూ.70 లక్షలను లోక్‌సభ ఎన్నికల ఖర్చు కోసం కాంగ్రెస్ అందించింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్‌కు రూ.50 లక్షలు, ఆనంద్ శర్మకు రూ.46 లక్షలను పార్టీ ఫండ్‌గా ఇవ్వగా.. ఇద్దరూ ఓడిపోయారు.