మధ్యప్రదేశ్, ఛత్తీస్​గఢ్‌లో కాంగ్రెస్ తొలి జాబితా రిలీజ్..

by Vinod kumar |
మధ్యప్రదేశ్, ఛత్తీస్​గఢ్‌లో కాంగ్రెస్ తొలి జాబితా రిలీజ్..
X

రాయ్‌పూర్‌/భోపాల్: మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాలను కాంగ్రెస్ విడుదల చేసింది. మధ్యప్రదేశ్‌లోని 144 అసెంబ్లీ స్థానాలకు, ఛత్తీస్‌గఢ్‌ లోని 30 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను అనౌన్స్ చేసింది. ఛత్తీస్‌గఢ్‌ అభ్యర్థుల జాబితాలో ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌, ఉపముఖ్యమంత్రి టీఎస్‌ సింగ్‌ డియో పేర్లు కూడా ఉన్నాయి. భూపేష్‌ బఘేల్‌ పఠాన్‌ అసెంబ్లీ స్థానం నుంచి, టీఎస్‌ సింగ్‌ డియో అంబికాపూర్‌ నుంచి బరిలోకి దిగనున్నారు. మధ్యప్రదేశ్ విషయానికొస్తే.. మాజీ ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ కమల్​నాథ్‌ను ఛింద్​వాఢా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ బరిలోకి దింపింది.

మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్​కుమారుడు జైవర్ధన్​సింగ్.. రఘీగథ్ స్థానం నుంచి పోటీలో నిలిచారు. బుధనీ స్థానంలో బీజేపీ సీఎం శివరాజ్​సింగ్ చౌహాన్ పై నటుడు విక్రమ్ మస్తాల్‌ను హస్తం పార్టీ రంగంలోకి దింపింది. ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లోని మిగతా అసెంబ్లీ సీట్లకు మరో రెండు రోజుల్లోగా అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. ఇక నవంబర్ 25న పోలింగ్ జరగనున్న రాజస్థాన్‌‌కు కాంగ్రెస్ ఇంకా అభ్యర్థుల జాబితాను విడుదల చేయలేదు.

Advertisement

Next Story