కాంగ్రెస్కు బిగ్ షాక్.. ఆ పార్టీలో చేరిన హస్తం పార్టీ ఎమ్మెల్యే

by Javid Pasha |   ( Updated:2023-05-29 11:02:32.0  )
కాంగ్రెస్కు బిగ్ షాక్.. ఆ పార్టీలో చేరిన హస్తం పార్టీ ఎమ్మెల్యే
X

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల విజయం తర్వాత మంచి ఊపు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. వెస్ట్ బెంగాల్ లో ఆ పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే బేరాన్ బిశ్వాస్ అధికార పార్టీ టీఎంసీలో చేరారు. ఈ విషయాన్ని టీఎంసీ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీ మీడియాకు తెలిపారు. రాష్ట్రంలో బీజేపీని ఎదుర్కోవాలంటే ఒక్క తృణమూల్ తో నే సాధ్యమనే విషయాన్ని ఎమ్మెల్యే బేరాన్ బిశ్వాస్ అర్థం చేసుకొని తమ పార్టీలో చేరారని వెల్లడించారు. కాగా ఈ ఏడాది ప్రారంభంలో సాగర్‌డిఘి నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో టీఎంసీ అభ్యర్థిపై బేరాన్ బిశ్వాస్ 22,986 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. అయితే మూడు నెలలు కూడా తిరగకముందే అధికార పార్టీ గూటిలో చేరిపోయారు.

Advertisement

Next Story