కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ అగ్రనేత కీలక విజ్ఞప్తి

by Harish |
కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ అగ్రనేత కీలక విజ్ఞప్తి
X

బెంగళూరు: మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి బీజేపీ, ఆరెస్సెస్‌పై తీవ్ర విమర్శలకు దిగారు. బీజేపీ, ఆరెస్సెస్‌లు ప్రజాస్వామ్యంపై దాడి చేస్తూ, దేశంలో విద్వేషాన్ని, హింసను వ్యాప్తి చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు మద్ధతిచ్చి 150 సీట్లలో గెలిపించాలని కోరారు. ఇలా చేస్తే బీజేపీ తమ ప్రభుత్వాన్ని దొంగలించదని సెటైర్లు వేశారు.

రెండు రోజుల కర్ణాటక పర్యటనలో భాగంగా భల్కిలోని బీదర్ లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. బీదర్ బసవన్న కర్మ భూమిగా ఉంది. ప్రజాస్వామ్యం గురించి మొదట మాట్లాడి, దానికి దారి వేసింది ఆయనే. అయితే నేడు దేశంలో ఆరెస్సెస్, బీజేపీ ప్రజాస్వామ్యంపై దాడి చేస్తుంది’ అని గాంధీ చెప్పారు.

సమాన భాగస్వామ్యం, అవకాశాలపై దాడి చేస్తున్నాయని విమర్శించారు. హిందుస్తాన్లో విద్వేషాన్ని రగిలిస్తూ.. బలహీన వర్గాల ప్రజల నుంచి డబ్బు తీసుకుంటూ.. వారి ధనికి స్నేహితులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. 40 శాతం కమిషన్ ప్రభుత్వానికి 40 సీట్లే ఇవ్వాలని కోరారు. బీజేపీ రాష్ట్రంలో ఇచ్చిన హామీలను నేరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు.

మరోవైపు రాష్ట్రంలో అమూల్, నందిని పాల రగడ నేపథ్యంలో రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశారు. నందిని ఉత్తమమైనదని, రాష్ట్ర బ్రాండ్ అని అన్నారు. మరోవైపు బీజేపీ నేత తేజస్వీ సూర్య రాహుల్‌కు చురకలు అంటించారు. కేరళలో నందిని ఉత్పత్తుల అమ్మకాలు సజావుగా సాగేలా చూడాలని ట్వీట్ ద్వారా కోరారు.

Advertisement

Next Story