- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆస్తి రూ.55 కోట్లు
దిశ, నేషనల్ బ్యూరో: తిరువనంతపురం లోక్‌సభ స్థానం నుంచి వరుసగా నాలుగో సారి పోటీ చేస్తున్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఎన్నికల అఫిడవిట్‌లో భాగంగా తన ఆస్తి వివరాలను వెల్లడించారు. తన నామినేషన్ పత్రాల్లో రూ.55 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు ఆయన ప్రకటించారు. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 4.32 కోట్లకు పైగా ఆదాయాన్ని సంపాదించినట్లు తెలిపారు. అలాగే, తనకు రూ.49 కోట్లకు పైగా స్థిరాస్తులు ఉన్నాయని, ఇవి 19 బ్యాంకు ఖాతాల్లో వివిధ మొత్తాలలో డిపాజిట్లు, బాండ్లు, డిబెంచర్లు, మ్యూచువల్ ఫండ్‌లలో పెట్టుబడుల రూపంలో ఉన్నాయని చెప్పారు. అఫిడవిట్ ప్రకారం, చరాస్తులలో రూ. 32 లక్షల విలువైన 534 గ్రాముల బంగారం, రూ.36,000 నగదు ఉన్నాయి. మారుతీ సియాజ్, మారుతీ ఎక్స్‌ఎల్6 అనే రెండు కార్లు, తిరువనంతపురంలో రూ.6.20 కోట్ల విలువైన 10.47 ఎకరాల భూమి, పాలక్కాడ్‌లోని 6.75 కోట్ల విలువైన ఇతర స్థిరాస్తులు, రాష్ట్ర రాజధానిలో రూ.52 లక్షల విలువైన ఇళ్లు ఉందని అఫిడవిట్‌లో ఆయన పేర్కొన్నారు. శశి థరూర్ 2009లో తిరువనంతపురం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించగా, అప్పటి నుంచి వరుసగా 2014, 2019 ఎన్నికల్లో కూడా గెలుపొందారు.