- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్ఎస్ఎస్ చేతుల్లోనే దేశం: రాహుల్ గాంధీ
లడఖ్ : దేశంలోని ప్రతి సంస్థను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) నడుపుతోందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. జమ్మూ కశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత తొలిసారిగా శుక్రవారం లడఖ్ వెళ్లిన ఆయన పై వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్న బీజేపీకి సైద్ధాంతిక మూలాధారమైన ఆర్‌ఎస్‌ఎస్.. ప్రతి సంస్థలో తన సొంత వ్యక్తులను అపాయింట్ చేస్తూ దేశంలోని అన్ని సంస్థలను గుప్పిట్లో పెట్టుకుందన్నారు. ప్రభుత్వ మంత్రులు కూడా వారి మార్గనిర్దేశంలోనే పనిచేస్తున్నారని విమర్శించారు. ‘మీరు కేంద్ర ప్రభుత్వంలోని మంత్రుల్లో ఎవరిని అడిగినా, వారు తమ మంత్రిత్వ శాఖలను నిర్వహించడం లేదనే చెబుతారు. ఆర్ఎస్ఎస్ ద్వారా నియమించబడిన వారే ఈ మంత్రిత్వ శాఖలను నడుపుతున్నట్లు ఎద్దేవా చేశారు.
ఇదే క్రమంలో లేహ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో యువతతో ముచ్చటించిన రాహుల్.. భారతదేశంలో స్వేచ్ఛను ఏకీకృతం చేయడమే రాజ్యాంగమని, ఇది నిబంధనల సమితి అని అన్నారు. రాజ్యాంగ దృక్పథానికి మద్దతు ఇచ్చే సంస్థలను ఏర్పాటు చేయడమే రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చే మార్గమని పేర్కొన్న రాహుల్.. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ మాత్రం తమ స్వంత వ్యక్తులను సంస్థాగత నిర్మాణంలో కీలక స్థానాల్లో నియమిస్తున్నాయని తెలిపారు.