- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
లోక్ సభలో వందకు చేరిన కాంగ్రెస్ ఎంపీల బలం
దిశ, నేషనల్ బ్యూరో: ఈసారి లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీగా పుంజుకుంది. లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీల బలం సెంచరీకి చేరింది. అయితే మహారాష్ట్ర రెబల్ విశాల్ పాటిల్ తిరిగి హస్తం గూటికి చేరారు. మహారాష్ట్ర మాజీ సీఎం వసంతదాదా పాటిల్ మనుమడు విశాల్ పాటిల్ ఈసారి సాంగ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. బీజేపీ నేత సంజయ్ పాటిల్ పై గెలుపొందారు.
కాంగ్రెస్ లో చేరిన రెబల్ నేత
ఎన్నికలకు ముందు ప్రతిపక్షాల కూటమి మహావికాస్ అఘాడీ మధ్య సీట్ల ఒప్పందం జరిగింది. సాంగ్లీ స్థానాన్ని శివసేన యూబీటీకి కేటాయించారు. దీంతో, కాంగ్రెస్ కు చెందిన విశాల్ పాటిల్ తిరుగుబాటు చేశారు. సాంగ్లీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఎన్నికల ఫలితాల తర్వాత, కాంగ్రెస్ రెబల్ అయిన విశాల్ పాటిల్.. హస్తం పార్టీకి పూర్తి మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే కూడా విశాల్ పాటిల్ ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఖర్గే తెలిపారు. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో 99 సీట్లు సాధించిన కాంగ్రెస్ బలం 100కు చేరినట్లయ్యింది.