- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పాక్ ఎన్నికల కోసమే కాంగ్రెస్ మేనిఫెస్టో: అసోం సీఎం బిస్వ శర్మ తీవ్ర విమర్శలు
దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టోపై అసోం సీఎం హిమంత బిస్వశర్మ మరోసారి తీవ్రంగా విరుచుకుపడ్డారు. హస్తం పార్టీ మేనిఫెస్టో ముమ్మాటికీ పాక్ ఎన్నికల కోసమే రూపొందించారని విమర్శించారు. కేరళలోని ఎర్నాకులంలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ మేనిఫెస్టో పాక్ ఎన్నికల్లో గెలిచేందుకు బాగా ఉపయోగపడుతుందని ఆరోపించారు. ‘సామాన్యుల నుంచి వనరులను లాక్కొని దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసే మేనిఫెస్టోను కాంగ్రెస్ తయారు చేసింది. దీనిని సరైన మార్గంలో అర్థం చేసుకున్నాం. ఈ మేనిపోస్టోపై బహిరంగ చర్చకు రావాలి. ఇది బుజ్జగింపు తప్ప మరొకటి కాదు’ అని వ్యాఖ్యానించారు. దేశంలోని వనరులపై ప్రతి ఒక్కరికీ హక్కు ఉందని నొక్కి చెప్పారు.
దేశంలోని వనరులపై మొదటి హక్కు ఒక నిర్దిష్ట వర్గానికే ఉంటుందని ఎందుకు చెప్పారో కాంగ్రెస్ సమాధానం చెప్పాలన్నారు. ఈ దేశంలోని షెడ్యూల్ తెగలు, షెడ్యూల్డ్ కులాలు, ఓబీసీలు పన్ను చెల్లింపుదారులు కాదా అని ప్రశ్నించారు. బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడటం కేవలం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమన్నారు. అంతకుముందు కూడా హిమంత కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. అలాగే ప్రజలు కష్టపడి సంపాదించిన సొమ్మును కాంగ్రెస్ ముస్లింలకు అందజేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.