రౌస్ అవెన్యూ కోర్టుకు రాహుల్ గాంధీ.. టెన్షన్ లో కాంగ్రెస్ శ్రేణులు

by Javid Pasha |   ( Updated:2023-05-23 15:10:10.0  )
రౌస్ అవెన్యూ కోర్టుకు రాహుల్ గాంధీ.. టెన్షన్ లో కాంగ్రెస్ శ్రేణులు
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు వెళ్లారు. ఫ్రెష్ గా ఆర్డినరీ పాస్ పోర్టుకు దరఖాస్తు చేసుకునేందుకు కావాల్సిన నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ కోసం రాహుల్ గాంధీ మంగళవారం రౌస్ అవెన్యూ కోర్టుకు వచ్చారు. ఈ క్రమంలోనే అంతకు ముందు ఉన్న డిప్లోమాటిక్ పాస్ పోర్టును ఆయన రద్దు చేసుకొని కొత్తగా ఆర్డినరీ పాస్ పోర్ట్ కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. కాగా మోడీ ఇంటిపేరు వ్యవహారానికి సంబంధించిన పరువు నష్టం కేసులో గత మార్చి నెలలో సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలోనే ఎంపీ పదవి నుంచి ఆయనను తొలగిస్తూ లోక్ సభ నిర్ణయం తీసుకుంది.

ఇక ఎంపీ పదవిని కోల్పోయిన రాహుల్.. ఆ కోటాలో ఇచ్చిన డిప్లోమాటిక్ పాస్ పోర్ట్ ను రద్దు చేసుకున్నారు. ప్రస్తుతం ఆయనకు ఎలాంటి ప్రభుత్వ పదవి లేని కారణంగా రాహుల్ ఆర్డినరీ పాస్ పోర్ట్ కు దరఖాస్తు చేసుకున్నారు. కాగా రాహుల్ గాంధీ రౌజ్ అవెన్యూ కోర్టుకు రావడంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు టెన్షన్ పడ్డారు. పరువు నష్టం కేసులో ఇప్పటికే రెండేళ్ల జైలు శిక్ష పడ్డ రాహుల్ మళ్లీ కోర్టుకు రావడంతో ఈ సారి ఎందుకు వచ్చారో తెలియక కాంగ్రెస్ నాయకులు ఖంగారు పడ్డారు. అయితే ఆయన కోర్టుకు వచ్చిన అసలు విషయం తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు.

Also Read..

మమత బెనర్జీతో భేటీ అనంతరం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story

Most Viewed