కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో యాత్ర

by GSrikanth |   ( Updated:2023-12-27 05:41:21.0  )
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో యాత్ర
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో యాత్రకు సిద్ధమయ్యారు. దీనికి ‘భారత్ న్యాయ యాత్ర’గా నామకరణం చేశారు. ఈ యాత్ర మణిపూర్ నుంచి ముంబై వరకు కొనసాగనుంది. వచ్చే నెల జనవరి 14వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ వరకు రాహుల్ గాంధీ యాత్ర చేయనున్నారు. మొత్తం 6,200 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ బస్సు యాత్ర, పాదయాత్ర చేయనున్నారు.

14 రాష్ట్రాల్లో 85 జిల్లాల మీదుగా ఈ యాత్ర సాగనుంది. కాగా, లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ రాహుల్ గాంధీ తీసుకున్న ఈ నిర్ణయంపై కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆయన చేసిన భారత్ జోడో యాత్ర ప్రభావం ప్రజలపై ఎంతో పడిందని.. ఇప్పుడు చేయబోయే ఈ భారత్ న్యాయ యాత్ర ప్రభావం కూడా లోక్‌సభ ఎన్నికలపై పడబోతోందని అభిప్రాయపడుతున్నారు. తప్పకుండా లోక్‌సభలో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed