విజన్ ఉన్న మనిషి రతన్ టాటా.. రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రులు సంతాపం

by Rani Yarlagadda |
విజన్ ఉన్న మనిషి రతన్ టాటా.. రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రులు సంతాపం
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ పారిశ్రామిక వేత్త, టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా (86) అనారోగ్యంతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన విజన్ ఉన్న వ్యక్తి అని, వ్యాపారం, దాతృత్వంలో చెరగని శాశ్వతముద్ర వేశారని పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో ఆయన కుటుంబానికి, టాటా కమ్యూనిటీకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ఎక్స్ లో పోస్ట్ చేశారు.

మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రతన్ టాటా మృతిపట్ల సంతాపం తెలిపారు. ఆయన మరణం ఎంతో బాధాకరమని, టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ భారతీయ పరిశ్రమలలో అగ్రగామి నాయకుడు, ప్రజాస్ఫూర్తితో కూడిన పరోపకారి అని పేర్కొన్నారు. టాటా మరణం వ్యాపార ప్రపంచానికి, సమాజానికి తీరని లోటన్నారు.

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్

ఇండస్ట్రీ లెజెండ్ రతన్ టాటా మరణవార్త తనను తీవ్రంగా కలచివేసిందన్నారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. ఆయన విధానాలు మిలియన్ల మంది జీవితాలను ఆదుకుందని గుర్తుచేసుకున్నారు. దేశం ఒక దిగ్గజాన్ని కోల్పోయింది కానీ.. ఆయన వారసత్వం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు. కుటుంబ సభ్యులకు, సహ ఉద్యోగులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ

రతన్ టాటా దార్శనిక నాయకత్వం, నైతికత, అచంచలమైన నిబద్ధత, దేశ అభివృద్ధి కోసం ఆయన చేసిన అపారమైన కృషి రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు. దేశానికే జాతీయ చిహ్నంగా నిలిచిన రతన్ టాటా మరణం.. ఎప్పటికీ తరని లోటుగానే మిగిలిపోతుందన్నారు.

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

రతన్ టాటా మరణం పై తాను చాలా దిగ్భాంతి గురయ్యానని తెలిపారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. ఇండస్ట్రీ ఐకాన్, విజనరీ లీడర్ లేని లోటు దేశానికి తీరలేనిదన్నారు. ఆయన లెగసీ, ప్రగతి చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు.

Advertisement

Next Story

Most Viewed