- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈసీపై ఒత్తిడి తెస్తున్నారు.. కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ విమర్శలు
దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల్లానే హర్యానాలోనూ ఓట్ కౌంటింగ్ ట్రెండ్స్‌ని ఈసీఐ సరిగా అప్‌డేట్ చేయడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ జైరాం రమేశ్ ఆరోపించారు. తప్పుడు ట్రెండ్స్ ఇవ్వాలంటూ అధికార యంత్రాంగంపై బీజేపీ ఒత్తిడి తెస్తోందనే అనుమానం తమకుందంటూ కీలక ఆరోపణలు చేశారు. మంగళవారం నాడు హర్యానా, జమ్మూ కశ్మీర్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ అంశంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం. 12, 13 రౌండ్ల లెక్కింపు పూర్తయినా ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్లో కేవలం 4, 5 రౌండ్ల ఫలితాలు మాత్రమే చూపిస్తున్నారు. కనీసం 8 సీట్లలో 11 రౌండ్ల కౌంటింగ్ పూర్తయిందని, ఆ సీట్లలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నా ఈసీ ఆ ఫలితాలు చూపెట్టడం లేదు. లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇలాగే జరిగింది. అప్పుడు నేను, అభిషేక్ సింఘ్వి ఈసీఐకి ఫిర్యాదు చేస్తే అప్పుడు అధికారులు చర్యలు తీసుకున్నారు. తాము ఈసీని రాజ్యాంగబద్ధమైన పక్షపాతం లేకుండా వ్యవహరించే సంస్థగా భావిస్తున్నాం. కానీ అధికార యంత్రాంగంపై ఇలంటి ఒత్తిడి ఉండడం సరికాదు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే ఈ ఫలితాలు చూసి కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదని, సాయంత్రం 3 గంటల వరకు కౌంటింగ్ సెంటర్ వద్దే ఉండాలని, అప్పుడే ఆట ముగిసిపోలేదని ధైర్యం చెప్పారు. ఇదంతా మైండ్ గేమ్ అని, దీని వల్ల తాము భయపడేది లేదని జైరాం రమేశ్ స్పష్టం చేశారు. తమకు ప్రజల మద్దతుందని, హర్యానాలో కూడా కచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.