- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజల ఆస్తులను దోచుకోవడానికే కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది: ప్రధాని మోడీ విమర్శలు
దిశ, నేషనల్ బ్యూరో: ప్రజల ఆస్తులను దోచేకోవడానికే కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో సోమవారం జరిగిన ర్యాలీలో మోడీ ప్రసంగించారు. ‘కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు ప్రజల ఆస్తులపై దృష్టి పెట్టాయి. వారు అధికారంలోకి రాగానే ఉన్నదంతా లాక్కుంటారు’ అని వ్యాఖ్యానించారు. అలీఘర్ ప్రజలు బుజ్జగింపులు, బంధుప్రీతి, అవినీతికి తాళాలు వేశారని కొనియాడారు. ఇద్దరు యువరాజులకు పటిష్టమైన తాళం వేశారని రాహుల్, అఖిలేష్ యాదవ్‌లను ఉద్దేశించి అన్నారు. ‘మొదట్లో ఉగ్రవాదులు వరుస పేలుళ్లకు పాల్పడేవారు. వారు అయోధ్య, కాశీలను వదలలేదు. కానీ ఇప్పుడు ఆ ప్రాంతాల్లో వరుస పేలుళ్లకు ఫుల్ స్టాప్ పడిందని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే ప్రజల జీతాలు, ఇళ్లు, వాహనాలపై సర్వే నిర్వహిస్తామన్నారు. కాంగ్రెస్ బుజ్జగింపు విధానాన్ని అనుసరించింది కానీ ముస్లింల సామాజిక, ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి ఏమీ చేయలేదని మండిపడ్డారు. అలాగే సమాజ్ వాదీ పార్టీ రాష్ట్రంలో అల్లర్లు, హత్యలు, గ్యాంగ్ వార్‌లను ప్రోత్సహించిందని తెలిపారు.