- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Caste Census : కులగణన కావాలంటున్నారు.. కులమేంటో అడగొద్దా ? :బసవరాజ్ బొమ్మై
దిశ, నేషనల్ బ్యూరో : కులగణన అంశంపై బీజేపీ ఎంపీ, కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై కీలక వ్యాఖ్యలు చేశారు. కులగణన నిర్వహించాలని డిమాండ్ చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ యావత్ దేశాన్ని అవమానిస్తోందని ఆయన విమర్శించారు. ‘‘కుల గణన గురించే విపక్షాలు మాట్లాడుతున్నందున.. వాళ్లలోని ఒక నేతను తన కులం గురించి అడిగితే అందులో అవమానకరమైన అంశం ఏముంది ?’’ అని బొమ్మై ప్రశ్నించారు. ‘‘విపక్షం చేస్తున్న డిమాండ్‌ను విని నేను షాక్‌కు గురయ్యాను. కులం గురించి అడగకుండా కులగణనను ఎలా నిర్వహించగలం ?’’ అని ఆయన పేర్కొన్నారు.
‘‘బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు విపక్షాలకు అవమానకరంగా అనిపిస్తే.. కులగణన కోసం విపక్షాలు చేస్తున్న డిమాండ్ యావత్ దేశానికి అవమానం కలిగించేలా అనిపిస్తోంది’’ అని బొమ్మై కామెంట్ చేశారు. ‘‘విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కులగణనను ఎందుకు చేయడం లేదు ? కర్ణాటకలో ఇప్పటికే కులగణన చేసినా.. దాని సమాచారాన్ని ఎందుకు విడుదల చేయడం లేదు ?’’ అని బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది ప్రశ్నలు సంధించారు.పార్లమెంటులో గగ్గోలు పెట్టే విషయంలో విపక్ష పార్టీలు ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయని ఆయన చురకలు అంటించారు.