- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కాంగ్రెస్ బోలెడు అకౌంట్లలో నాలుగే ‘అటాచ్’ : బీజేపీ
దిశ, నేషనల్ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ అయిపోయి నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతోందంటూ జరుగుతున్న ప్రచారంపై బీజేపీ ఘాటుగా స్పందించింది. కాంగ్రెస్‌కు ఉన్న చాలా బ్యాంకు అకౌంట్లలో మూడు లేదా నాలుగు మాత్రమే ఆదాయపు పన్ను శాఖ అటాచ్ చేసిందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర వెల్లడించారు. రూ.135 కోట్ల పన్ను బకాయిలు చెల్లించనందున ఆ అకౌంట్లపై ఐటీ శాఖ చర్యలు తీసుకుందన్నారు. ఆ మూడు, నాలుగు అకౌంట్లను అటాచ్ మాత్రమే చేశారని.. ఫ్రీజ్ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. సంబిత్ పాత్ర శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బ్యాంకు అకౌంట్ల అంశంపై దేశ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేస్తోందని విమర్శించారు. ఐటీ శాఖ అటాచ్ చేసిన ఆయా బ్యాంకు అకౌంట్లలో కాంగ్రెస్ పార్టీ డబ్బులు వేయడం, తీయడం వంటి అన్నిరకాల యాక్టివిటీస్‌ను నిర్వహించుకోవచ్చన్నారు. ‘‘కాంగ్రెస్ పార్టీకి వివిధ బ్యాంకు అకౌంట్లలో దాదాపు రూ.1000 కోట్ల డబ్బు ఉంది. రూ.500 కోట్లు విలువైన స్థిరాస్తులు ఉన్నాయి’’ అని సంబిత్ పాత్ర తెలిపారు. కాంగ్రెస్ అకౌంట్లు స్తంభించిపోవడంతో రైలు టికెట్లు బుక్ చేసుకునేందుకు కూడా తమ వద్ద నిధులు లేని దుస్థితి వచ్చిందని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ప్రతిరోజూ చార్టర్డ్ విమానంలో ప్రయాణిస్తున్న రాహుల్ గాంధీ.. రైలు టికెట్లు కొనడానికి కాంగ్రెస్ దగ్గర డబ్బులు లేవని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.