- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది: మోడీ
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలోని పాత పార్లమెంట్ భవన్ లో ఈ రోజు ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశం జరిగింది. ఇందులో ఎన్డీయే పక్ష నేతగా మోడీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ప్రధాని మోడీ తనకు మూడో సారి అవకాశం కల్పించినందుకు అందరికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే దేశ వ్యాప్తంగా బీజేపీ, ఏన్డీయే ప్రభుత్వాన్ని ప్రజలు మరోసారి ఆదరించారని తెలిపారు. ఎనిమిది రాష్ట్రాల్లో బీజేపీ క్లీన్ స్విప్ చేసిందని గుర్తు చేశారు. అలాగే ఇటీవల కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. కానీ ఆ రాష్ట్రాల్లో బీజేపీకే అత్యధిక స్థానాలు దక్కాయని.. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ రెండు రాష్ట్రాల్లోనూ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు. కాగా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో 17+2, తెలంగాణలో 8 స్థానాలు వచ్చాయి.