Mallikarjun Kharge: వారిది టెర్రరిస్టుల పార్టీ.. బీజేపీపై ఫైర్ అయిన ఖర్గే

by Shamantha N |
Mallikarjun Kharge: వారిది టెర్రరిస్టుల పార్టీ.. బీజేపీపై ఫైర్ అయిన ఖర్గే
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. కాంగ్రెస్‌ ‘అర్బన్‌ నక్సల్‌’ పార్టీని నడుపుతోందన్న మోడీ కామెంట్లపై తీవ్రంగా స్పందించారు. బీజేపీ టెర్రరిస్టుల పార్టీ అని ఫైర్ అయ్యారు. “మోడీ ఎప్పుడూ కాంగ్రెస్‌ను అర్బన్ నక్సల్ పార్టీగా అభివర్ణిస్తారు. అది ఆయనకు అలవాటే. అయితే ఆయన సొంత పార్టీ సంగతేంటి? బీజేపీ ఉగ్రవాదుల పార్టీ. ఆ పార్టీ నేతలకు అనేక హత్యలతో సంబంధం ఉంది. మా పార్టీకి ఇలాంటి ఆరోపణలు చేసే హక్కు మోడీకి లేదు. “ అని ఖర్గే ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ని నిందించడం మోడీకి అలవాటుగా మారిందని నిప్పులు చెరిగారు.

మోడీ ఏమన్నారంటే?

ఇకపోతే, కాంగ్రెస్‌ను అర్బన్‌ నక్సల్స్‌ నడిపిస్తున్నారని ప్రధాని మోడీ రెండుసార్లు వివిధ సందర్భాల్లో పేర్కొన్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత అక్టోబరు 9న ఆయన ప్రసంగించారు. హర్యానా ఎన్నికల్లో బీజేపీ విజయం దేశంలోని మూడ్‌ని తెలియజేస్తోందన్నారు. కాంగ్రెస్ "అర్బన్ నక్సల్స్" అని.. ఆ విద్వేషపూరిత కుట్రలకు తాము బలి కాబోమని ప్రజలు చూపించారని ప్రధాని మోడీ అన్నారు. అంతకుముందు మహారాష్ట్రలోని వాసిమ్ లో జరిగిన సభలో మోడీ అర్బన్ నక్సల్స్ అని కాంగ్రెస్ ని ఉద్దేశించి అన్నారు. హస్తం పార్టీ "ప్రమాదకరమైన ఎజెండా"ను ఓడించడానికి ప్రజలు కలిసి రావాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. కాగా.. ఈ వ్యాఖ్యలపైనే ఖర్గే స్పందించారు.


Advertisement

Next Story

Most Viewed