- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
7న కాంగ్రెస్ సీఈసీ భేటీ.. ప్రధాన ఎజెండా అదే!
by Hajipasha |
X
దిశ, నేషనల్ బ్యూరో : లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) గురువారం సాయంత్రం 6 గంటలకు భేటీ కానుంది. మార్చి 7న జరిగే సమావేశంలో పార్టీ మేనిఫెస్టో ముసాయిదాపైనా చర్చ జరుగుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) పరిశీలించిన అనంతరం కాంగ్రెస్ మేనిఫెస్టో ముసాయిదా నివేదికను పార్టీ జాతీయ అధ్యక్షుడికి అందజేస్తామని మేనిఫెస్టో కమిటీకి నేతృత్వం వహిస్తున్న మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం వెల్లడించారు. సీఈసీకి ఛైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉన్నారు. సభ్యులుగా అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఉన్నారు.
Advertisement
Next Story