కిచ్చా సుదీప్ బీజేపీకి మద్దతుపై కాంగ్రెస్ ఎటాక్

by samatah |
కిచ్చా సుదీప్ బీజేపీకి మద్దతుపై కాంగ్రెస్ ఎటాక్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మే 10వ తేదీన జగరబోయే కర్ణాటక ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ హోరాహోరీగా సాగుతున్న వేళ కన్నడ స్టార్ కిచ్చా సందీప్ బీజేపీకి మద్దతునివ్వడం హాట్ టాపిక్ అయింది. కిచ్చా సుదీప్ నిర్ణయంపై కాంగ్రెస్ ఎటాక్ ప్రారంభించింది. కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సూర్జేవాలా మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ఎవరినైనా ప్రభావితం చేయగలదని, ఎంత మేరకు ప్రభావితం చేయగలరో చేయనివ్వండి అన్నారు. కర్ణాటక ఎన్నికలను 6.5 కోట్ల మంది కన్నడిగులు ప్రభావితం చేస్తారు తప్ప సినీ యాక్టర్లు కాదని సెటైర్లు వేశారు. అంతకు ముందు కిచ్చా సుదీప్ ఆయన బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం జోరుగా వినిపించింది. అయితే బుధవారం బెంగళూరులో సీఎం బసవరాజ్ బొమ్మైతో సమావేశం అయ్యారు. బీజేపీలో చేరుతానంటూ వస్తున్న ఊహాగానాలపై క్లారిటీ ఇచ్చారు. తాను రాజకీయాల్లో చేరడం లేదని కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం మాత్రమే చేస్తానన్నారు.

Advertisement

Next Story