మహిళా బిల్లుకు మనస్ఫూర్తిగా మద్దతిచ్చాం : Sharad Pawar

by Vinod kumar |
NCP chief Sharad Pawar
X

ముంబై: పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు మనస్ఫూర్తిగా మద్దతిచ్చాయని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మంగళవారం అన్నారు. మహిళా సాధికారత కోసం గతంలో మహారాష్ట్ర, కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలే చర్యలు చేపట్టాయని గుర్తుచేశారు. మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడిన పవార్.. ‘మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్, ‘ఘమాంధీ’(అహంకారపూరిత) కూటమి మిత్రపక్షాలు అయిష్టంగానే మద్దతిచ్చినట్లు ప్రధాని మోడీ ఆరోపించారు. కానీ అది నిజం కాదు. మేమంతా ఈ బిల్లుకు మనస్ఫూర్తిగా మద్దతు ఇచ్చాం. దీనిపై ప్రధానికి తప్పుడు సమాచారం ఇచ్చారు’ అన్నారు.

1994 జూన్ 24న మహారాష్ట్రలో తన నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమే.. దేశంలోనే తొలిసారిగా మహిళా విధానాన్ని ఆవిష్కరించిందన్నారు. అదే విధంగా, కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 73వ రాజ్యాంగ సవరణను తీసుకొచ్చిందని తెలిపారు. స్థానిక ఈ చర్యల వల్లే స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం కోటాకు మార్గం సుగమమైందని చెప్పారు. అలాగే తాను రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో మహిళలకు 11 శాతం రిజర్వేషన్లు కల్పించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా పవార్ గుర్తు చేశారు.

Advertisement

Next Story

Most Viewed