Raghav Chaddha : హర్యానాలో కాంగ్రెస్‌‌తో పొత్తుకే టాప్ ప్రయారిటీ : ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా

by Hajipasha |
Raghav Chaddha : హర్యానాలో కాంగ్రెస్‌‌తో పొత్తుకే టాప్ ప్రయారిటీ : ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా
X

దిశ, నేషనల్ బ్యూరో : హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-ఆప్ పొత్తుపై ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం పొత్తు విషయమై ఇరుపార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. దేశ ప్రయోజనాల కోసం చేతులు కలిపేందుకు ఇరు పార్టీలు సిద్ధంగానే ఉన్నాయన్నారు. దేశానికి, హర్యానాకు మేలు చేకూర్చే గొప్ప ఆశయంతో కాంగ్రెస్-ఆప్ పొత్తు కుదుర్చుకునే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని రాఘవ్ చద్దా ఆశాభావం వ్యక్తం చేశారు.

పొత్తు కుదుర్చుకునేందుకే సాధ్యమైనంత మేర ప్రయత్నాలు జరుగుతాయన్నారు. హర్యానా ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పదేపదే చెబుతుండేవారు. ప్రస్తుతం ఆయన తిహార్ జైలులో ఉండటంతో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఈ నేపథ్యంలో కాంగ్రె‌స్‌తో కలిసి హర్యానా ఎన్నికల బరిలోకి దిగేందుకు ఆప్ ప్రాధాన్యత ఇస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed