- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rahul Gandhi: రాహుల్ గాంధీ నాలుక కోస్తే రూ.11 లక్షలు.. ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై మహారాష్ట్రలోని ఏక్ నాథ్ షిండే వర్గం ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ నాలుక కోసిన వారికి రూ.11 లక్షలు ఇస్తానని ఆఫర్ ఇచ్చారు. అమెరికా పర్యటనలో రిజర్వేషన్లపై మాట్లాడిన రాహుల్ గాంధీ వ్యాఖ్యల నేపథ్యంలో గైక్వాడ్ కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీ వెనుకబడిన గిరిజనులు, ఇతరులకు రిజర్వేషన్లు దక్కకుండా చేయాలని చూస్తున్నారని సంజయ్ ధ్వజమెత్తారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ అసలు రూపాన్ని బట్టబయలు చేసిందని విమర్శించారు. గాంధీ వ్యాఖ్యలు ప్రజలకు చేసిన అతి పెద్ద ద్రోహమని, మరాఠాలు, ధన్‌గర్లు, ఓబీసీలు వంటి వర్గాలు రిజర్వేషన్ల కోసం పోరాడుతుటే అంతకంటే ముందే వాటి ప్రయోజనాలను అంతం చేయడం గురించి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని గైక్వాడ్ ఆరోపించారు.
ఈ దేశాన్ని కాంగ్రెస్ 400 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లాలని యోచిస్తోందని మండిపడ్డారు. అయితే సంజయ్ గైక్వాడ్ వ్యాఖ్యలను తాను సమర్థించబోనని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులే స్పష్టం చేశారు. కాగా విదర్భ ప్రాంతంలోని బుల్దానా అసెంబ్లీ స్థానం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న గైక్వాడ్‌కు వివాదాలు కొత్తేమీ కాదు. గతంలో ఆయన వ్యాఖ్యలు, చర్యలు అనేక సందర్భాల్లో కాంట్రవర్సీగా మారాయి. గతంలో తాను పులిని వెటాడానని ఆ పులి దంతాన్ని తాను మెడలో వేసుకున్నట్లు చేసిన వ్యాఖ్యలతో ఆయనపై వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద అభియోగాలు మోపబడ్డాయి. అలాగే తనకు కరోనా వైరస్ దొరికితే దానిని నేరుగా సీఎం ఫడ్నవీస్ నోటిలో వేస్తానంటూ గతంలో సంజయ్ గైక్వాడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.