- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nagam Janardhan Reddy : రేవంత్ నీ జిమ్మిక్కులు మానుకో...!
దిశ, నాగర్ కర్నూల్ :- రేవంత్ నీ జిమ్మిక్కులు మానుకొని రైతులకు రెండు లక్షల రుణమాఫీ పూర్తి చెయ్ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నాగం జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం నాగర్ కర్నూల్ లోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పాలమూరు రంగారెడ్డి పంప్ హౌస్ మునిగిందని ఆరోపించారు. హైడ్రా కూల్చివేతలు సమర్థిస్తున్నానని అన్నారు. కానీ పేదల ఇండ్లు కూల్చేస్తున్నారు వారిని ప్రభుత్వం ఆదుకోని, నూతన ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే అనుచరులు అక్రమ ఇసుక దందా నడిపిస్తున్నారని, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కనుసన్నల్లోనే ఈ దందా జరుగుతుందన్నారు.
కల్లు దందా పై తాను 2020లో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ స్టే ఇచ్చిన వాటిని అరికట్టలేకపోతున్నారని మండిపడ్డారు. జిల్లాలో మొన్న జరిగిన ధాన్యం రవాణా టెండర్లలో గందరగోళం, ఉద్రిక్తత ఏర్పడి హైకోర్టు టెండర్లు ఆపేయాలని స్టే ఇచ్చే వరకు వచ్చిందన్నారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యేకు 50 ఏళ్ళు ఉన్నాయని నేను చిన్న పిల్లోడు అనుకున్న నాకంటే 20 ఏళ్లు చిన్నోడు అంతే అని ఎమ్మెల్యే పై సెటైర్లు వేశారు. ఆరు గ్యారెంటీ ల పేరుతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు వాటికి మంగళం పలికారని అన్నారు. పింఛన్, ఉచిత కరెంటు, గ్యాస్, రైతుబంధు వంటివి అమలు కావడం లేదని మండిపడ్డారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట నష్టం జరిగిన వారికి వెంటనే నష్టపరిహారం అందజేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.