Maharashtra Assembly Elections: ‘మహాయుతి’ ప్రభుత్వంపై జైరాం రమేశ్ కీలక వ్యాఖ్యలు

by Shamantha N |
Maharashtra Assembly Elections: ‘మహాయుతి’ ప్రభుత్వంపై జైరాం రమేశ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు (Maharashtra Assembly Elections) వేళ కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార కూటమి ‘మహాయుతి’పై(Mahayuti) విరుచుకుపడ్డారు. ఈ కూటమి ద్రోహంతో ఏర్పాటైందని, ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో జరిగిన వైఫల్యాలను మహారాష్ట్ర ప్రజలు మన్నించరని అన్నారు. బీజేపీ, శివసేన (షిండే వర్గం), ఎన్సీపీ (అజిత్‌ వర్గం) సారథ్యంలో కొనసాగుతున్న మహాయుతి కూటమి ప్రభుత్వ పాలనలో రైతులు అత్యంత నిర్లక్ష్యానికి గురవుతున్నారని ఆరోపించారు. పెద్ద హామీలేవీ అమలు చేయలేదని ఆరోపించారు.

మరఠ్వాడాలో నీటి ఎద్దడి

మరఠ్వాడా నుంచి ప్రతి గ్రామానికీ తాగునీటి పంపిణీకి వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. మరఠ్వాడాలో 600కు పైగా గ్రామాలు, 178 చిన్న చిన్న గ్రామాల్లో నీటి ఎద్దడి ఉందన్నారు. ఈ ఏడాది వేసవి నాటికి ఐదేళ్లు గడిచినా.. ఇంతవరకు తాగునీటి సమస్యకు పరిష్కారం చూపించలేకపోయారన్నారు. గతేడాది రిజర్వాయర్లలో 40 శాతం తాగునీరు ఉండగా.. ప్రస్తుతం 19 శాతం మాత్రమే ఉందని పేర్కొన్నారు. జలయుక్త్‌ శివిర్‌ అని వాగ్దానం చేసి.. జల్‌ముక్త్‌ శివిర్‌గా మార్చారన్నారు. రైతులను నిర్లక్ష్యం చేశారన్నారు.

Advertisement

Next Story

Most Viewed