రెజ్లర్ల నిరసనపై నాటకీయ పరిణామం.. నిరసన విరమించలేదా?

by GSrikanth |
రెజ్లర్ల నిరసనపై నాటకీయ పరిణామం.. నిరసన విరమించలేదా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా గత కొంత కాలంగా ఆందోళన చేస్తున్న రెజ్లర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. కొన్ని వారాలుగా తమకు న్యాయం చేయాలంటూ ఢిల్లీలో ఆందోళనకు దిగిన సాక్షి మాలిక్, బజరంగ్ పునియా, వినేశ్ ఫోగాట్‌లు రైల్వేలో తిరిగి విధుల్లో చేరినట్లు సోమవారం ప్రకటించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన రెండు రోజుల్లోనే ఈ విషయం బయటకు వచ్చింది. వీరంతా మే 31నే విధుల్లో చేరినట్లు రైల్వే శాఖ వర్గాలు పేర్కొన్నాయి.

ఇదిలా ఉంటే టాప్ రెజ్లర్ల నిరసనపై నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. రెజ్లర్లు తమ ఆందోళన విరమించినట్లు తొలుత వార్తలు చక్కర్లు కొట్టాయి. తమ నిరసనను విరమించి తిరిగి ప్రభుత్వ విధులకు హాజరైనట్లు ప్రచారం జరిగింది. కానీ ఈ ప్రచారంపై బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ స్పందించారు. ఆందోళన విరమించారనే వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. బ్రిజ్ భూషణ్‌ను అరెస్ట్ చేయాలని అమిత్ షాను కోరామని తమ ఉద్యోగాలను చేస్తూనే ఆందోళన కొనసాగిస్తామని సాక్షి మాలిక్ చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed