- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రెండు కొత్త జాతి వానపాములను కనుగొన్న పరిశోధకులు
దిశ, నేషనల్ బ్యూరో: కేరళలోని మహాత్మ గాంధీ యూనివర్శిటీ శాస్త్రవేత్తల సహకారంతో సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ ఒడిశా(సీయూఓ) పరిశోధకులు రెండు కొత్త వానపాము జాతులను కనుగొన్నట్టు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వానపాములకు సంబంధించి నిర్వహించిన అధ్యయనంలో సీయూఓ విద్యార్థి ఆయుస్మితా నాయక్ రాణి డుడుమ, జైపూర్ ఘాట్ ప్రాంతాల నుంచి కొన్ని పెద్ద వానపాముల నమూనాలను సేకరించినట్టు స్కూల్ ఆఫ్ బయోడైవర్శిటీ అండ్ కంజర్వేషన్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్ డీన్ శరత్ కుమార్ తెలిపారు. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిటైర్డ్ సైంటిస్ట్ ఆర్ పాలివాల్, మహాత్మాగాంధీ యూనివర్సిటీ అడ్వాన్స్‌డ్ సెంటర్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ అండ్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్‌కు చెందిన నిపుణులు ప్రశాంత నారాయణన్, ఏపీ థామస్‌ల సహకారంతో పరిశోధకులు ఈ నమూనాలను ప్రయోగశాలలో పరిశీలించారు. కనుగొన్న రెండు కొత్త జాతులు గాస్కోలెక్స్‌ఝేపొర్‌ఘాసెన్సిస్, మెగాస్కోలెక్స్‌క్వాడ్రిపాపిలాటస్ అని, ఇవి పూర్తిగా సైన్స్‌కు కొత్తవని పాలివాల్ వెల్లడించారు. ప్రపంచంలోనే మొత్తం మెగాస్కోలెక్స్ జాతుల సంఖ్య ఇప్పుడు 70కి పెరిగిందని, వాటిలో 34 భారత్‌లోనే ఉన్నాయన్నారు.