అబద్ధాలతో తప్పుడు కథనాలు అల్లారు- దీదీ వ్యాఖ్యలు ఖండించిన నిర్మలాసీతారామన్

by Shamantha N |
అబద్ధాలతో తప్పుడు కథనాలు అల్లారు- దీదీ వ్యాఖ్యలు ఖండించిన నిర్మలాసీతారామన్
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యలను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ఖండించారు. మమతా బెనర్జీకి నిర్ణీత సమయం ఇచ్చారని అన్నారు. ఎవరు ప్రసింగించినా అది.. ప్రతి టేబుల్‌ ముందు ఉన్న స్క్రీన్‌పై ప్రదర్శించారని తెలిపారు. టీఎంసీ అధినేత్రి తన మైక్‌ను నిలిపివేశారని చెబుతున్న మాటలు పూర్తిగా అవాస్తవమని మండిపడ్డారు. మమతా బెనర్జీ మరోసారి అబద్ధాలతో తప్పుడు కథనాలు అల్లారని ఆరోపించారు.

బెంగాల్ సీఎం

ప్రధాని మోడీ అధ్యక్షతన నిర్వహించిన నీతి ఆయోగ్ సమావేశం నుంచి మమతా బెనర్జీ వాకౌట్ చేశారు. సమావేశంలో మాట్లాడనివ్వకుండా తన మైక్ ఆఫ్ చేసారని ఆరోపించారు. నీతి ఆయోగ్ ను రద్దు చేసి ప్లానింగ్ కమిషన్ తిరిగి తేవాలని డిమాండ్ చేశారు. “చంద్రబాబు సమావేశంలో 20 నిమిషాలు మాట్లాడారు.. ఇతర నేతలు 15 నిమిషాలు మాట్లాడారు.. విపక్షాల నుంచి నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైందని నేను ఒక్కదాన్నే.. కనీసం నాకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. కేంద్ర వివక్షాపూరితంగా వ్యవహరిస్తోంది.. బడ్జెటే రాజకీయంగా ఉంది” అని మమతా మండిపడ్డారు. నీతి అయోగ్ సమావేశంలో తన మైక్ కట్ చేయడం అంటే.. బెంగాల్ ప్రజలను మాత్రమే కాదు అన్ని ప్రాంతీయ పార్టీలను కూడా అవమానించడమేనిన అని మండిపడ్డారు.



Next Story

Most Viewed