RENU DESAI: ఈ క్లిష్ట పరిస్థితుల్లో మాకు మీ సహాయం కావాలి.. దయచేసి ఆలోచించండంటూ రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్

by Kavitha |
RENU DESAI: ఈ క్లిష్ట పరిస్థితుల్లో మాకు మీ సహాయం కావాలి.. దయచేసి ఆలోచించండంటూ రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘జానీ’, ‘బద్రి’ వంటి సినిమాల్లో పవన్‌ కళ్యాణ్ సరసన నటించి అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ కొన్ని కారణాల రీత్యా విడాకులు తీసుకుని వేరుగా ఉంటున్నారు. ఇక విడాకుల తర్వాత పవన్‌ కళ్యాణ్ మరో పెళ్లి చేసుకుని ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్నాడు. ఇక రేణు దేశాయ్ మాత్రం మరో పెళ్లి చేసుకోకుండా తమ పిల్లల (ఆద్య, అకిరా నందన్) బాధ్యతలను చూసుకుంటుంది. అయితే గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈమె.. ‘టైగర్ నాగేశ్వరావు’ మూవీతో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ.. పేద పిల్లలకు, జంతువులకు సహాయం చేస్తుంది. తనకు తోచినంత సహాయం చేయడంతో పాటుగా.. తన ఫ్యాన్స్‌ను కూడా విరాళాలు అడుగుతూ యానిమల్ లవర్ అనిపించుకుంటుంది. అలాగే సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

ఈ క్రమంలో.. తాజాగా, ఇన్‌స్టా వేదికగా సాయం కావాలంటూ ఓ పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్‌లో భాగంగా.. "నమస్కారం జంతు ప్రేమికుల్లారా..! మా శక్తి మేరకు ఇటీవల వరదల్లో చిక్కుకుపోయిన విచ్చలవిడి జంతువులను రక్షించేందుకు మా ప్రత్యేక బృందం విజయవాడకు వచ్చింది. ఈ పని కొన్ని రోజులు కొనసాగుతుంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మాకు మీ సహాయం కావాలి. దయచేసి ఆలోచించండి. మాకు విరాళం అందించండి" అంటూ స్కానర్స్‌తో పాటు బ్యాంక్ డీటైల్స్ పెట్టింది.అది చూసిన నెటిజన్లు వారికి తోచినంత సహాయం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.


Advertisement

Next Story

Most Viewed