గణేష్ మండపం వద్ద అగ్ని ప్రమాదం.. కన్నీరుమున్నీరవుతున్న చిన్నారులు (వీడియో)

by Gantepaka Srikanth |
గణేష్ మండపం వద్ద అగ్ని ప్రమాదం.. కన్నీరుమున్నీరవుతున్న చిన్నారులు (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. శనివారం రాత్రి గణపతి మండపం(Ganesh Mandapam) వద్ద భారీ అగ్ని ప్రమాదం జరగ్గా.. పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. నగరంలోని దిల్‌సుఖ్‌నగర్ P.N.T కాలనీలో ప్రతి సంవత్సరం ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈసారి అదే విధంగా నిర్వహించే క్రమంలో కొత్తగా పత్తి (Cotton)తో డెకరేషన్ చేశారు. అంతా పూర్తయింది అనుకునే లోపు మెయిన్ స్విచ్ ఆన్ చేసిన వెంటనే ఒక్కసారిగా షాక్ సర్క్యూట్ అయి విద్యుత్(Electricity) ఘాతుకానికి కాలి బూడిద అయిపోయింది.

దైవ అనుగ్రహం ఉండడం వల్ల ఏ ఒక్కరికి కూడా చిన్న గాయం కాలేదని స్థానికులు, నిర్వహకులు ఊపిరిపీల్చుకుంటున్నారు. ఈ ఘటనకు ఐదు నిమిషాల ముందు మండపం వద్ద ఉన్న చిన్నారులు అందరు తమ ఇంటికి వెళ్ళారు. అలా వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇలా జరిగిపోయింది. మండపం వద్ద చిన్నారులంతా కన్నీరుమున్నీరయ్యారు. విషయం తెలుసుకున్నపోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed