Sukrudu: శుక్రుడికి ఇష్టమైన రాశులు ఇవే.. మీ రాశి ఉందా?

by Prasanna |
Sukrudu:  శుక్రుడికి ఇష్టమైన రాశులు ఇవే.. మీ రాశి ఉందా?
X

దిశ, వెబ్ డెస్క్: జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడి స్థానం చాలా ప్రత్యేకం. ఎవరి జన్మ నక్షత్రంలో అయితే శుక్రుడు శుభస్థానంలో ఉంటాడో వారికీ డబ్బు సమస్యల నుంచి బయటపడతారు. ఈ గ్రహాన్ని శృంగారం, సంపదకి సూచికగా పరిగణిస్తారు. ఈ గ్రహం ఎప్పుడైతే తన స్థానాన్ని మార్చుకుంటుందో అప్పుడు కొన్ని రాశుల వారి జీవితాల్లో మార్పులు వస్తాయి. గ్రహాలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు.. అవి ఒక చోట నుంచి ఇంకో చోటుకు కదులుతాయి. అయితే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడికి ఇష్టపమైన రాశులు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

తులారాశి

శుక్రుడికి తులారాశి అంటే చాలా ఇష్టం. అందుకే ఈ గ్రహం సంచారం చేసినప్పుడు వీరి జీవితాల్లో కొత్త మార్పులు వస్తాయి. మొదలు పెట్టిన ప్రతీ పనిని ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తి చేస్తారు. అలాగే వ్యాపారాల్లో అనేక లాభాలు పొందుతారు. అలాగే కెరీర్ పరంగా మంచిగా ఉంటుంది. ఈ రాశి వారికీ లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది.

మీన రాశి

మీన రాశి అంటే కూడా శుక్రుడికి ఎంతో ఇష్టం. కాబట్టి శుక్రుడు కదిలినప్పుడు ఈ రాశి వారిపై ప్రభావం చూపిస్తుంది. దీని కారణంగా వారు విపరీతంగా డబ్బు సంపాదిస్తారు. అంతేకాకుండా జీవితంలో వచ్చే ఎన్నో సమస్యలు ఒంటరిగా ఎదుర్కొంటారు. దీంతో పాటు ఆరోగ్య సమస్యలను కూడా దాటుకుని ముందుకు వెళ్తారు. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Advertisement

Next Story

Most Viewed