- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భార్యకు దోమలు కుడుతున్నాయని కంప్లైంట్.. పోలీసులు ఏం చేశారంటే?
by Sathputhe Rajesh |
X
దిశ, వెబ్‌డెస్క్: దోమలు కుట్టి భార్య, కూతురు ఇబ్బంది పడుతున్నారని ఓ వ్యక్తి పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని సంభల్ జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే అసద్ ఖాన్ భార్య ఆదివారం రాత్రి చందౌసిలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆసుపత్రిలో విపరీతంగా ఉన్న దోమలు అసద్ భార్య, నవజాత శిశువును తీవ్రంగా కుట్టడంతో చిన్నారి ఏడవడం ప్రారంభించింది.
వారి ఇబ్బందులు చూడలేని అసద్ ఖాన్ మస్కిటో కిల్లర్ కోసం బయటకు వెళ్లాడు. అర్ధరాత్రి కావడం వల్ల దుకాణాలన్నీ మూసి ఉండటంతో చేసేదిలేక యూపీ పోలీసులకు విషయాన్ని ట్వీట్ చేశాడు. వెంటనే స్పందించిన పోలీసులు ఆసుపత్రికి వచ్చి మరీ అసద్ ఖాన్‌కు మస్కిటో కిల్లర్‌ను అందించారు. మాఫియా నుంచి మస్కిటో వరకు దేన్నైనా ఎదుర్కొంటామని పోలీసులు తమ ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు.
Advertisement
Next Story