కూలిన కేబుల్ బ్రిడ్జ్.. సంచలన వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం

by Mahesh |
కూలిన కేబుల్ బ్రిడ్జ్.. సంచలన వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం
X

దిశ, వెబ్‌డెస్క్: గంగానదిపై నిర్మాణంలో ఉన్న కేబుల్ బ్రిడ్జి కూలిపోయిన సంఘటనసై బీహార్ రాష్ట్ర డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం బ్రిడ్జి కూలిన తర్వాత తేజస్వి మాట్లాడుతూ.. తేజస్వి యాదవ్ బీహార్ ప్రభుత్వం వంతెన రూపకల్పనలో "తీవ్రమైన లోపాలను" గుర్తించినందున దానిని కూల్చివేయాలని ఇప్పటికే యోచిస్తోందని చెప్పారు. అలాగే గత ఏడాది బ్రిడ్జి లో కొంత భాగం కూలిపోవడంతో ఐఐటీ-రూర్కీకి స్ట్రక్చరల్ ఆడిట్‌ని అప్పగించినట్లు ఆయన తెలిపారు. కానీ ఇంతలోనే బ్రిడ్జ్ కూలిపోయింది.

Advertisement

Next Story

Most Viewed