- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
కోల్‌కతా కేసు.. రేపు మరోసారి సుప్రీంలో విచారణ
దిశ, వెబ్ డెస్క్ : పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కతా(Colcutta) ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ వైద్యురాలి హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగినప్పటి నుండి ఆ రాష్ట్రంలోని వైద్యులు, వైద్య విద్యార్థులు సమ్మెలోనే ఉన్నారు. వైద్యుల రక్షణకు పటిష్టమైన చట్టాలు తీసుకువచ్చే దాకా తమ నిరసనలు ఆపబోమని తేల్చి చెప్పారు. అయితే వైద్యుల సమ్మె వెనకాల గల ఉద్దేశాన్ని సమర్థించిన సుప్రీంకోర్ట్(Supreme court).. ప్రజలకు అందాల్సిన విలువైన వైద్య సేవలను దృష్టిలో పెట్టుకొని సమ్మె విరమించాలని వైద్యులను ఆదేశించింది. ఇక బెంగాల్ ప్రభుత్వం కూడా సమ్మెలో ఉన్న వైద్యులతో చర్చలు జరిపేందుకు ముందుకు వచ్చినప్పటికీ.. తమ డిమాండ్స్ కు అనుగుణంగా ముందుకు వస్తేనే చర్చలకు వస్తామని.. లేనిపక్షంలో చర్చలకు రాలేమని వైద్యులు తెగేసి చెప్పారు. మరోవైపు సెప్టెంబర్ 11 నాటికి ఎట్టిపరిస్థితుల్లో వైద్యులు సమ్మె విరమించి విధుల్లో జాయిన్ అవ్వాలని మరోసారి సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ.. సమ్మెలో ఉన్న వైద్యులు ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ తమ నిరసనలు కొనసాగిస్తున్నారు. ఇదే వ్యవహారంపై సుప్రీంకోర్ట్ రేపు మరోసారి విచారణ చేపట్టనుంది. ఈ ఘటనపై బెంగాల్ ఆరోగ్యశాఖ సమర్పించిన నివేదికపై కూడా సుప్రీం విచారణ చేయనుంది.