Cm yogi: క్రిమినల్స్ ఉత్పత్తి కేంద్రంగా ‘ఎస్పీ’.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

by vinod kumar |
Cm yogi: క్రిమినల్స్ ఉత్పత్తి కేంద్రంగా ‘ఎస్పీ’.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
X

దిశ, నేషనల్ బ్యూరో: సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ)పై ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ (Yogi aadithyanath) తీవ్రంగా మండిపడ్డారు. క్రిమినల్స్, మాఫియాలకు ఎస్పీ ఉత్పత్తి కేంద్రంగా మారిందని ఆరోపించారు. ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చే నేరగాళ్లకు పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav), మరోనేత శివపాల్ యాదవ్‌(Shivapal Yadav)లు రక్షకులుగా ఉంటున్నారని తెలిపారు. ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మీర్జాపూర్‌లో నిర్వహించిన ర్యాలీలో యోగీ ప్రసంగించారు. ప్రజల సంపదను దోచుకోవడానికే ఎస్పీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎస్పీ అధికారంలో ఉన్నప్పుడు క్రిమినల్స్‌కు స్వేచ్ఛ ఉండేదని, బీజేపీ పాలన చేపట్టాక పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. ‘సోషలిస్టు ఉద్యమం విలువలతో కూడింది. జయప్రకాష్ నారాయణ, రామ్ మనోహర్ లోహియాలు ఎంతో ఆదర్శాలతో ఉద్యమాన్ని నడిపారు. విలువలు కలిగిన రాజకీయాల గురించి ప్రచారం చేశారు. కాంగ్రెస్ పాలనను సైతం వ్యతిరేకించి ప్రజాస్వామ్యం కోసం పోరాడారు. కానీ ప్రస్తుత ఎస్పీ నాయకత్వం సోషలిస్టు మూమెంట్‌ను మట్టుబెట్టింది. నేరగాళ్లు, మాఫియాల కూటమిగా మారింది’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి రాష్ట్రంలోని అభివృద్ధికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.

Next Story

Most Viewed