CM Yogi Adityanath: కుంభమేళాలో తొక్కిసలాట.. సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక ప్రకటన

by Shiva |   ( Updated:2025-01-29 03:10:21.0  )
CM Yogi Adityanath: కుంభమేళాలో తొక్కిసలాట.. సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: మౌని అమావాస్య (Mouni Amavasya) పర్వదినం సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh)లోని ప్రయాగ్‌రాజ్‌ (Prayagraj)లో జరుగుతోన్న కుంభమేళా (Kumbhmela)లో పుణ్య స్నానం ఆచరించేందుకు దేశ వ్యాప్తంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి 2 గంటల సమయంలో త్రివేణి సంగమం (Triveni Sangam) వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో భక్తులు మరణించగా.. మరికొందరికి గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే సీఎం యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) భక్తులను ఉద్దేశించి కీలక ప్రకటన చేశారు.

తొక్కిసలాట జరిగిన త్రివేణి సంగమం (Triveni Sangam) ఘాట్ వద్దకు ఎవరూ రావొద్దని భక్తులకు సూచించారు. తమకు సమీపంలో ఉన్న ఘాట్ల వద్దే అమృత స్నానాలు ఆచరించాలని కోరారు. దేశ వ్యాప్తంగా ప్రయాగ్‌రాజ్‌ (Prayagraj)కు వస్తున్న భక్తుల కోసం ప్రత్యేకంగా ఘాట్లను ఏర్పాటు చేశామని అన్నారు. మిగతా అన్ని ఘాట్లలో పరిస్థితి సాధారణంగా ఉందని అన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికారుల సూచనలు పాటించాలని భక్తులను కోరారు. అయితే, నేడు మహా కుంభమేళా (Maha Kumbhmela)కు 10 కోట్ల మంది వచ్చినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు.

కాగా, మహా కుంభమేళాలో మంగళవారం అర్ధరాత్రి తొక్కిసలాట జరిగింది. త్రివేణి సంగమం వద్ద భక్తులు అమృత స్నానం కోసం ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో ఘాట్ వద్ద బారికేడ్లు విరిగిపడటంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 17 మంది భక్తులు మరణించినట్లుగా సమాచారం అందుతోంది. ఈ మేరకు గాయపడిన 50 మంది క్షతగాత్రులను పారా మిలటరీ దళాలు, వాలంటీర్లు అంబులెన్స్‌లలో సమీపంలోని మహాకుంభ్ నగర్‌లోని సెంట్రల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. మౌని అమావాస్య సందర్భంగా భక్తులు పుణ్య స్నానానికి భారీ ఎత్తున తరలిరావడంతో తొక్కిసలాట చోటుచేసుకున్నట్లుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం.

Advertisement

Next Story