Prayagraj stampede: తొక్కిసలాట ఘటనపై స్పందించిన సీఎం యోగి ఆధిత్యనాధ్

by Mahesh |
Prayagraj stampede: తొక్కిసలాట ఘటనపై స్పందించిన సీఎం యోగి ఆధిత్యనాధ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్ లోని మహాకుంభమేళ(Mahakumbh Mela)లో రాత్రి జరిగిన తొక్కిసలాట(Stampede)పై సీఎం యోగి ఆధిత్యనాధ్(CM Yogi Adhityanath) స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అఖారా మార్గ్‌(Akhara Marg)లో బారికేడింగ్‌ను దాటడానికి ప్రయత్నించిన కొంతమంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు(seriously injured). గాయపడిన వారిని వెంటనే వైద్య శిబిరానికి తరలించారు. భక్తులకు, స్వామీజీలకు, పర్యాటకులకు కీలక విజ్ఙప్తి చేశారు. కుంభమేళ సందర్భంగా 12 కిలో మీటర్ల పొడవులు ఘాట్‌లు ఏర్పాటు చేశామని, భక్తులు తమకు దగ్గరలో ఉన్న ఘాట్లలో పవిత్ర స్నానాలు చేయాలని సూచించారు. నిన్న రాత్రి నుంచి మౌని అమావాస్య స్నానాలు ప్రారంభమయ్యాయి. ప్రయాగ్‌రాజ్‌లో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. మౌని అమావాస్య ఘడియలు(Mauni Amavasya clocks) ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 8 కోట్ల మంది స్నానాలు చేశారు. ఇవాళ ఉదయం 8 గంటల లోపే 3 కోట్ల మంది భక్తులు స్నానాలు చేశారు.

తొక్కిసలాట ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) ఇప్పటి వరకు నాలుగుసార్లు ఫోన్‌ చేసి మాట్లాడారు. అలాగే కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) కూడా పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారని అన్నారు. ఇదిలా ఉంటే సీఎం యోగి(CM Yogi Adhityanath) మాత్రం మృతులకు సంబంధించిన వివరాలను మాత్రం ప్రకటించలేదు. కానీ కొన్ని జాతీయా మీడియాలో మాత్రం 10 నుంచి 20 మంది భక్తులు తొక్కిసలాటలో మరణించారని మరో 50 మంది వరకు గాయాలైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది.

ఇదిలా ఉంటే తొక్కిసలాట ఘటనపై కుంభమేళ అథారిటీ ప్రత్యేక అధికారి(Kumbh Mela Authority Special Officer) ఆకాంక్ష రాణా(Akanksha Rana) స్పందిస్తూ.. సంగంలోని నోస్ వద్ద భారికేడ్లు తిరిగి పడిపోవడంతో ఒక్కసారిగా ప్రజలు ఆందోళనకు గురయ్యారు. దీంతో భక్తులు అదుపుతప్పి ఒకరిపై మరొకరు పడిపోయినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే పలువురికి గాయాలయ్యాయి, వెంటనే వారిని చికిత్స నిమిత్తం స్థానికంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి తరలించామని ఆమె తెలిపారు. ఈ ఘటన మరీ అంత తీవ్రమైనది కాదని ప్రస్తుతం తొక్కిసలాట జరిగిన ప్రాంతాల్లో యధావిధిగా భక్తులు వెళ్తున్నారని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆకాంక్ష రాణా స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed